రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో  క్రైం రికార్డ్స్‌ బ్యూరో ఎస్‌ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ.. ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్‌, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్‌ఐగా పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)