దేశంలో చిట్టచివరి భూభాగం ధనుష్కోడి !

Telugu Lo Computer
0


మిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ధనుష్కోడి గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు ఈ గ్రామంలోనే ఉంది. ధనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాన హిమాలయాలతో మొదలుకుని దక్షిణాన సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది.  ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా ఈ ప్రాంతం మునిగిపోతుంది. ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)