'సిటడెల్‌ : హనీ బన్నీ' వెబ్‌సిరీస్‌కు ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డు !

Telugu Lo Computer
0


సమంత, వరుణ్ ధావన్‌ కీలకపాత్రల్లో నటించిన 'సిటడెల్‌ : హనీ బన్నీ'  వెబ్‌సిరీస్‌కు అవార్డు లభించింది. ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ వెబ్‌సిరీస్‌గా నిలిచింది. అవార్డును అందుకున్న సందర్భంగా దర్శకుల్లో ఒకరైన డీకే సంతోషం వ్యక్తం చేశారు. సినిమా, వెబ్‌సిరీస్‌ తీయడం వెనుక చాలా మంది కృషి ఉందని, అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలను తెలిపారు. రాజ్‌ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమంత, వరుణ్‌ల నటన, యాక్షన్‌ సన్నివేశాలు సిరీస్‌కు హైలైట్‌గా నిలిచాయి. 'ఫ్యామిలీమ్యాన్‌', 'ఫర్జీ' వంటి విజయవంతమైన సిరీస్‌లతో అలరించిన దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)