ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి, మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. ఆ స్థలానికి పరిశీలించారు.. యూట్యూబర్ తిరుమలరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేపట్టారు. వృత్తిరీత్యా వివాదాలతో హత్య చేశారా ? భూ వివాదంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు తిరుమల్ రెడ్డి.. కర్నూలు జిల్లా మద్దికేర వాసిగా చెబుతున్నారు పోలీసులు.
యూట్యూబర్ అనుమానాస్పద మృతి ?
February 18, 2025
0
Tags