ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, పాక్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కీలక మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాక్ 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ కీలక మ్యాచ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాడు నసీమ్ షా క్యాచ్ పట్టడంతో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 157 క్యాచ్ లు పట్టాడు. ఇంతకు ముందు మహ్మద్ అజారుద్దీన్(156) పేరు మీదున్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ గొప్ప ఫీల్డర్ గా నిలిచిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ పరంగా చూస్తే వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన మూడో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంకకు మహేల జయవర్ధనే(218) ఉండగా రెండో స్థానంలో రికీ పాంటింగ్(160) ఉన్నాడు. త్వరలోనే విరాట్ కోహ్లీ రికీ పాంటింగ్ ను కూడా అధిగమించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచ్ లు పట్టిన టాప్ -5 ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ నిలవడం విశేషం.
వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ !
February 23, 2025
0
Tags