గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష రాసిన నవ వధువు : వీడియో వైరల్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో నేడు గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష పోస్ట్‌పోన్ చేసేందుకు ఏపీపీఎస్సీ నిరాకరించడంతో అనుకున్న డేట్ ప్రకారమే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష జరిగింది.ఈ పరీక్ష రాసేందుకు అభ్యర్థులంతా పరీక్ష టైమ్‌కు ముందుగానే హాజరయ్యారు. అయితే తిరుపతిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని మొత్తం 13 సెంటర్లలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతుండగా ఓ సెంటర్ వద్ద పరీక్ష రాసేందుకు హాజరైన యువతిని చూసి అంతా ఆశ్యర్యపోయారు. పట్టు బట్టలు, పెళ్లి కూతురుగా ముస్తాబై పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె చూసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్‌కు మమత అనే యువతి పెళ్లి పీటల నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పెళ్లయిన వెంటనే పెళ్లి కూతురుగానే పసుపు దుస్తులతో పరీక్ష కేంద్రంలో అడుగు పెట్టింది. చిత్తూరుకు చెందిన మమత వరుడుతో తాళి కట్టించుకుని తలపై జిలకర, బెల్లం పెట్టుకునే పూల జడతోనే పరీక్షకు హాజరైంది. పెళ్లయిన వెంటనే సమయం లేక పెళ్లి దుస్తులే ధరించి పరీక్ష రాసేందుకు వచ్చింది. హడావుడిగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న మమతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె డెడికేషన్‌కు మెచ్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)