కిరణ్‌ రాయల్‌పై అంతర్గత విచారణకు జనసేన ఆదేశం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)