అమెరికన్ మల్టీనేషనల్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ భారీగా ఉద్యోగుల లేఆఫ్స్‌కి ప్లాన్ సిద్ధం చేసింది. 2025 అంతా ఉద్యోగుల కోతలు ఉంటాయని ప్రకటించిందని పలు నివేదికలు చెబుతున్నాయి. జేపీ మోర్గాన్ చేజ్ మేనేజర్లు ఉద్యోగులకు సమాచారం ఇప్పటికే అందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నారు. ఆ తర్వాత మార్చి మధ్యలో, మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీగా కోతలు ఉంటాయని తెలుస్తోంది. ''మేము మా వ్యాపార అవసరాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తాము. దీని ప్రకారం, మా సిబ్బందిని సర్దుబాటు చేస్తాము'' అని కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌కి పంపిన మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది మా వ్యాపార సాధారణ నిర్వహణలో భాగమని, చాలా తక్కువ మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని సంస్థ చెబుతోంది. 2024 చివరి నాటికి బ్యాంకులో 317,233 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం తొలగింపులు ఉద్యోగుల్లో 0.3 శాతం ఉంటాయి.
జేపీ మోర్గాన్ చేజ్ లో లే ఆఫ్స్ ?
February 13, 2025
0
Tags