2025-26 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రవేశపెట్టారు. లోక్ సభలో బడ్జెట్ గురించి సుధీర్ఘ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం పలు సంస్కరణలకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొత్తగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం తీసుకొస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా దేశంలో వెనుకబడిన వంద జిల్లాల్లో వ్యవసాయ రంగ ప్రోత్సాహానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కోటి 70లక్షల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు నిర్మలాసీతారామన్. పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు మంజూరుచేస్తామన్నారు. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నట్లు తెలిపారు. బీమాలో ఎఫ్ డీఐలపై 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతి.. లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ప్రకటించారు. అలాగే 56 మందులపై కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. టీవీలు కూడా ఖరీదైనవిగా మారతాయి. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు,మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ ఎలక్ట్రిక్ వెహికల్స్, భారతదేశంలో తయారైన దుస్తులు, క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు లిథియం సహా పలు రకాల ఖనిజాలు తగ్గనున్నాయి.
బడ్జెట్ తరువాత తగ్గనున్న వస్తువులు !
February 01, 2025
0
Tags