బీహార్‌ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర బడ్జెట్ సహాయపడుతుంది : నీతీశ్ కుమార్‌

Telugu Lo Computer
0


కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు ప్రాధాన్యం కల్పించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ''బడ్జెట్‌లో బీహార్‌కు ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర బడ్జెట్ సహాయపడుతుంది'' అని నీతీశ్ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేంద్రం బీహార్‌పై వరాలు కురిపించింది. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థికసాయం అందిస్తామని పేర్కొంది. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుచేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన నీతీశ్ మోదీ సర్కార్‌పై ప్రశంసలు కురిపించారు. కాగా, బిహార్‌కు అధిక ప్రాముఖ్యం ఇవ్వడంపై ప్రతిపక్షాలు పెదివి విరిచాయి. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి కాబట్టే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చింది అంటూ భాజపాపై ఆరోపణలు చేశాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)