పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక నోటీసు జారీ

Telugu Lo Computer
0

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన పాలసీదారులకు, కస్టమర్లకు సైబర్ మోసాలపై హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరుతో మోసపూరిత మొబైల్ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది" అని పేర్కొంటూ ఎల్ఐసీ పరిస్థితిని స్పష్టం చేసింది. ఫేక్ యాప్స్ నమ్మితే మోసపోతారని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా మీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది. పాలసీదారులు, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే పూర్తయ్యేలా చూసుకోవాలని ఎల్ఐసీ పేర్కొంది. సేవల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా డిజిటల్ యాప్‌ వంటి వాటితో పాటు వారి వెబ్‌సైట్‌లో జాబితా చేసిన.. ఇతర చెల్లింపు గేట్‌వేలను మాత్రమే ఉపయోగించాలి. ఇతర ఫేక్ యాప్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే.. దానికి సంస్థ బాధ్యత వహించదని స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)