దేశీయ మార్కెట్లో ఈ ఏప్రిల్ నుంచి టెస్లా ఈవీ విక్రయాలు ప్రారంభం కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.21లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కంపెనీ రిటైల్ కార్యకలాపాలను మాత్రమే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సదరు కథనాలు వెల్లడించాయి. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి ఈవీ కార్లను దిగుమతి చేసుకుని భారత మార్కెట్లో విక్రయించేందుకు టెస్లా సన్నాహాలు ప్రారంభించిందట. షోరూంల ఏర్పాటు కోసం ముంబయిలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్, న్యూదిల్లీలోని ఏరోసిటీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. తొలుత 25 వేల డాలర్ల (దాదాపు రూ.21లక్షలు) వరకు విలువ చేసే ఎలక్ట్రిక్ వాహనాలను టెస్లా విక్రయించనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి భారత్‌లో ఈవీల తయారీపై టెస్లా ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అయితే, భారత ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల నుంచి విడిభాగాలను కొనుగోళ్లను మరింత పెంచుకోవాలని కంపెనీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
భారత్‌లో ఏప్రిల్ నుంచి టెస్లా కార్ల అమ్మకాలు ?
February 19, 2025
0
Tags