బాలీవుడ్ నటుడు గోవింద, అతని భార్య సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలం విడివిడిగా ఉంటున్నారని.. ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో వీరి 37 సంవత్సరాల వైవాహిక బంధానికి తెరపడనుంది. సునీత ఒక ఇంటర్వ్యూలో తాము ఇద్దరం గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నామని వెల్లడించారు. సునీత తన పిల్లలతో కలిసి ఫ్లాట్‌లో నివసిస్తుందని సమాచారం. ఓ 30 ఏళ్ల మరాఠి నటితో గోవింద రిలేషన్ షిప్ దీనికి కారణమని తెలుస్తోంది. గోవింద, సునీత 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా ఇద్దరు పిల్లలున్నారు. గోవింద, సునీత ఇద్దరూ చాలా చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
నటుడు గోవింద దంపతులు విడాకులు ?
February 25, 2025
0
Tags