క్షమాపణలు చెప్పిన ఐఐటీ బాబా !

Telugu Lo Computer
0


చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్‌ గెలవదంటూ ఐఐటీ బాబా  జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. 'ఈసారి భారత్ గెలవదు. విరాట్ కోహ్లీ సహా అందరికీ ఈ విషయం చెప్పండి. ఇండియా గెలవదని నేను చెబుతున్నానంటే ఇండియా గెలవదంతే' అంటూ ఐఐటీ బాబా జోష్యం చెప్పారు. అయితే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా తాజాగా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. 'నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)