ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలనుకున్న పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాక్, బంగ్లా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. గురువారం రావల్పిండిలో ఉదయం నుంచి వర్షం కురవడంతో మైదానమంతా చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ మొత్తం జలమయం అవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు. పాకిస్థాన్‌తోపాటు బంగ్లాదేశ్ ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది. మరోవైపు గ్రూప్ ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఆదివారం టీమ్ఇండియా, కివీస్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలుస్తుంది. రావల్పిండిలో మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణమైన విషయం తెలిసిందే.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు !
February 27, 2025
0
Tags