కుంభమేళాలో ప్రాణాంతక మల బ్యాక్టీరియా ?

Telugu Lo Computer
0


మహా కుంభమేళాలో భక్తులు పవిత్ర స్నానం చేసే పలు ప్రాంతాలకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో ప్రాణాంతక మల కోలిఫామ్ బ్యాక్టీరియాను గుర్తించినట్లు పేర్కొంది. ప్రమాదకర స్థాయిలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తాజాగా ఓ నివేదికను అందజేసింది. మురుగునీటి కాలుష్యానికి సూచిక అయిన మల కోలిఫామ్ బ్యాక్టీరియా పరిమితి 100 మిల్లీలీటర్లకి 2500 యూనిట్లు ఉంటుందని కానీ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని నదిలో ఎక్కువగా ఉందని పేర్కొంది. మానవుడి నుంచి వెలువడిన మలంలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. నీటిలో మల విసర్జన చేసిన చోట బ్యాక్టీరియా ఉద్భవిస్తుంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ఈ బ్యాక్టీరియా స్థాయి ప్రమాదకర స్థాయికి చేరినట్లు సీపీసీబీ నివేదికలో పేర్కొంది.ఇవి తాగడానికి, ఈత కొట్టడానికి, స్నానం చేయడానికి సురక్షితంగా లేదని నివేదించింది. ఈ బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య కారణాలు వస్తాయి. వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం.. లాంటి సమస్యలు వస్తాయని సీపీసీబీ పేర్కొంది. చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ బ్యాక్టీరియా తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)