జొమాటో ఫుడ్ డెలివరీతో పాటు తన యాప్ ద్వారా 'ఫీడింగ్ ఇండియా' కార్యక్రమానికి విరాళాలు సేకరిస్తుంటుంది. వీటి ద్వారా ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 19 కోట్ల మంది ఆకలి తీర్చగలిగామని ఆ కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. యూజర్ల చొరవతోనే ఇదంతా సాధ్యమైందంటూ కొనియాడారు. అంతేకాదు తాము చేస్తున్న కృషిని అభినందిస్తూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తనకు రాసిన లేఖను సైతం తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ''రోజూ మా ఆకలి తీరుస్తున్న ఫీడింగ్ ఇండియా టీమ్‌కు ధన్యవాదాలు. మా గురించి కూడా ఆలోచించే వారు ఉండటం ఆనందం కలిగిస్తోంది. మాతో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా చాలా సాయం చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పని చాలా మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. నేను బాగా చదువుకుంటున్నాను. ఏదో ఒక రోజు నేను కూడా మీలానే ఇతరులకు సాయం చేసి, ప్రేమను పంచే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ఆ విద్యార్థి తన లేఖలో రాసుకొచ్చింది. ఈ లేఖపై స్పందిస్తూ తాము చేస్తున్న పనికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ గోయల్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్‌జీఓ గురించి మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో అందిస్తామన్నారు.
రోజూ మా ఆకలి తీరుస్తున్న ఫీడింగ్ ఇండియా టీమ్‌కు ధన్యవాదాలు : జొమాటో సీఈఓకు 8 ఏళ్ల బాలిక లేఖ
February 21, 2025
0
Tags