అమెరికాలోని కెంటకీలో వచ్చిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 8కి చేరింది. అక్కడి ఒబియాన్ నదికి సంరక్షణగా నిర్మించిన కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా సమీప ప్రాంతాలు జలమయం అయ్యాయని ఒబియాన్ కౌంటీ మేయర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీంతోపాటు ఆ ప్రాంతంలో విపత్తు సంభవించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతోపాటు ఫెడరల్ సహాయాన్ని కూడా ఆయన కేటాయించారు. ఆదివారం వచ్చిన వరద నుంచి వందల మందిని రక్షించినట్లు రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. ఈ సంఖ్య 1,000 వరకు ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో చాలాచోట్ల రోడ్లు మునిగిపోయాయి. కెంటకీలోని రివర్ మెడికల్ సెంటర్ ప్రాంతానికి కూడా వరద నీరు చొచ్చుకురావడంతో చాలామంది పేషెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. 39,000 ఇళ్లల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. బలమైన గాలులు వీస్తుండటంతో మరిన్ని ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోవచ్చని భావిస్తున్నారు.
అమెరికాలోని కెంటకీ వరదల్లో 8 మంది మృతి
February 17, 2025
0
Tags