దేశీయ మార్కెట్లో బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV లాంచ్ అయింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాగా జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సౌండ్ క్వాలిటీ కోసం సూపీరియరైన 12 స్పీకర్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వాటర్ డ్రాప్ టెయిల్ లాంప్స్, వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీ, 15.6 అంగుళాల రొటేటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నప్పా లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్లు, 128-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, భద్రత కోసం వాహనంలో 11 ఎయిర్‌బ్యాగులు.. డ్రైవర్ ఫెటీగ్ మానిటరింగ్ సిస్టమ్ అందించారు. ఈ కారులో 82.56 kWh బ్యాటరీని అమర్చారు. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారులో ఉన్న మోటారు 390 kW శక్తి, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ మోటారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 567 కిలోమీటర్ల NEDC పరిధిని అందిస్తుంది. ఈ వాహనంతో 7KW ఛార్జర్ కూడా అందించనున్నారు. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. రూ.48.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరగా విడుదల చేసింది. ప్రీమియం వేరియంట్‌ను ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ.54.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ వాహనాన్ని 17 జనవరి 2025న విడుదల చేశారు.. కాగా.. 18 జనవరి 2025 నుండి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ కారు డెలివరీ మార్చి 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 70,000 బుకింగ్‌లు పూర్తయ్యే వరకు మాత్రమే వర్తిస్తుంది. బుకింగ్ ప్రారంభమైనప్పటి నుండి, ఇప్పటివరకు 1,000 బుకింగ్‌లు వచ్చాయి. BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV ప్రీమియం విభాగంలో ప్రవేశించింది. ఈ విభాగంలో ఇది హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6, BMW iX7 వంటి ఎలక్ట్రిక్ SUVs తో నేరుగా పోటీపడుతుంది.
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ విడుదల !
February 17, 2025
0
Tags