13 అంతస్తులతో మూడు బ్లాకులతో పూర్తయిన ఆరెస్సెస్‌ భవనం

Telugu Lo Computer
0


న్యూ ఢిల్లీలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన 'రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌'  కార్యాలయ పనులు దాదాపు పూర్తికావడంతో కార్యకలాపాలను అక్కడకు మార్చారు. 3.75 ఎకరాల స్థలంలో ఉన్న పాత రెండంతస్తుల కార్యాలయం 'కేశవ్‌ కుంజ్‌' స్థానంలో అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీనిని నిర్మించారు. ఒక్కొక్కటి 13 అంతస్తుల్లో మూడు బ్లాకులు, 300 గదులు, కార్యాలయాలు, అధునాతన సమావేశ మందిరాలు దీనిలో ఉంటాయి.కరోనా అవాంతరాల వల్ల పనులు నిలిచిపోవడంతో ఇది పూర్తయ్యేందుకు ఎనిమిదేళ్ల సమయం పట్టింది. నూతన భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న నిర్వహించబోయే కార్యకర్తల సమ్మేళనానికి సంఘ్‌ అగ్రనేతలు మోహన్‌ భాగవత్, దత్తాత్రేయ హొసబలె హాజరవుతారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)