నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు వారిని ఢీకొట్టింది. దీంతో మహిళతో పాటు ఆ యువకుడు అంతెత్తు ఎగిరి పడ్డారు. యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. మృతి చెందిన యువకుడిని లాలూ నారద్ తాంటి అలియాస్ దాస్ (29), గాయపడిన మహిళను ప్రమీళ ప్రభాకర్ దాస్‌గా (44) గుర్తించారు. వారిద్దరు తలోజాలోని పద్ఘేగావ్‌లో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. అయితే దాస్ బీహార్‌కు చెందినవాడని, ఉపాధి నిమిత్తం నవీ ముంబైకి వచ్చాడని తెలిపారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లో ఉన్న కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు : ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
January 15, 2025
0
Tags