తిరుపతిలోని అలిపిరి సమీపంలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది. వేదిక్ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను.. ద్విచక్రవాహనంపై వెళ్తోన్న తితిదే ఉద్యోగి విజయ్‌కుమార్ చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. విజయ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ, తితిదే సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు.
చిరుతను చూసి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన తితిదే ఉద్యోగికి తీవ్ర గాయాలు !
January 11, 2025
0
Tags