కొండపోచమ్మ సాగర్ లో సెల్ఫీ కోసం దిగి గల్లంతైన యువకులు : ఒకరి శవం లభ్యం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని మర్కుల్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఏడుగురు యువకులు ప్రమాదవశాత్తు డ్యామ్ లో పడినట్టు తెలుస్తోంది. సెల్ఫీ కోసం దిగి గళ్లంతై మృతి చెందిన ఐదుగురిలో ఒక యువకుని శవాన్ని వెలికి తీసారు. స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు, గజ ఈతగాళ్లు డ్యామ్ లో గాలించారు. గల్లంతైన వారంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. శామీర్ పేట నుంచి ప్రత్యేక బోటు తీసుకొచ్చారు. అలాగే నాటు పడవలతో గల్లంతైన నలుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)