ఏథర్ ఎనర్జీ రిజ్టా జెడ్ స్కూటర్ మోడల్ డ్యాష్ బోర్డులో తెలుగు భాషతో పాటు, ఎనిమిది ప్రాంతీయ భాషలను అందుబాటులో ఉంచే నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇకపై వినియోగదారులు తమ స్కూటర్‌ను వివిధ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కొత్త భాషా ఆప్షన్లు మరాఠి, గుజరాతీ, బెంగాలీ, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషలను సమర్థించేలా ఉంటాయి. ఇటువంటి ప్రయోజనాలు వినియోగదారులకు వీరి మాతృభాషలో సులభంగా ఇంటరాక్ట్ చేయగలిగేలా చేస్తాయి. అలాగే, ఈ స్కూటర్‌లో వినియోగదారులు ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ భాషలు ఎంపికలు చేసుకోవచ్చు. అంతే కాకుండా రిజ్టా జెడ్ స్కూటర్‌లో మరిన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఆటో హెల్డ్, వాట్సాప్ ఇన్‌ఫర్మేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, అలెక్సా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త భాష ఆప్షన్స్‌తో, ఎవరైతే తమ మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారో వారు ఈ స్కూటర్‌ను మరింత ఇష్టపడతారని చెప్పవచ్చు. స్కూటర్ మోడల్ రిజ్టా జెడ్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటి బ్యాటరీ ప్యాక్ 2.9 kWh సామర్థ్యం కలిగి ఉంది, ఇది రూ.1.26 లక్షలకు లభిస్తుంది. రెండవ బ్యాటరీ ప్యాక్ 3.7 kWh సామర్థ్యం కలిగి ఉంది, ఇది రూ.1.46 లక్షలకు అందుబాటులో ఉంటుంది. ఇంకా, రిజ్టా ఎస్ వేరియంట్ రూ.1.09 లక్షలలో అందిస్తారు. ఈ స్కూటర్‌లో 2.9kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నప్పుడు 123 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో 159 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్లలో టాప్ స్పీడ్ 80 kmph ఉంటుంది.
ఏథర్ ఎనర్జీ రిజ్టా జెడ్ స్కూటర్ డ్యాష్ బోర్డులో తెలుగుతో పాటు ఎనిమిది ప్రాంతీయ భాషలు !
January 26, 2025
0
Tags