ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో కార్లోస్ అల్కరాజ్ జోరు !

Telugu Lo Computer
0


స్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగుతోంది. టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన అల్కరాజ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన సెకండ్ రౌండ్‌లో అల్కరాజ్ 6-0, 6-1, 6-4 తేడాతో జపాన్ ప్లేయర్ నిషియోకాను ఓడించాడు. అల్కరాజ్ ఆధిపత్యం ముందు నిషియోకా తేలిపోయాడు. మూడో సెట్‌లో కాస్త పోటీ ఇచ్చినా.. అల్కరాజ్ జోరు ముందు నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. మరో హాట్ ఫేవరేట్ ప్లేయర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కూడా మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఏడో సీడ్ జకోవిచ్ మరోసారి ఓ సెట్‌ను కోల్పోయినా తర్వాతి సెట్లలో విజయం సాధించి ముందంజ వేసాడు. బుధవారమే జరిగిన రెండో రౌండ్‌లో జకోవిచ్ 6-1, 6-7(4), 6-3, 6-2 తేడాతో జైమీ ఫారియా(పోర్చుగల్)పై విజయం సాధించాడు. పదునైన సర్వీసులు చేసిన జకోవిచ్.. ఈ మ్యాచ్‌లో 14 ఏస్‌లతో పాటు 33 విన్నర్లు కొట్టాడు. ప్రత్యర్థి 6 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేయడం జకోవిచ్‌కు కలిసొచ్చింది. కెరీర్‌లో జకోవిచ్‌కు ఇది 430వ మ్యాచ్. దాంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ జ్వెరెవ్(జర్మనీ) 6-1, 6-4, 6-1 తేడాతో మార్టినెజ్(స్పెయిన్)ను ఓడించాడు. చెక్ ఆటగాడు మెన్సిక్ 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో నార్వే ప్లేయర్, ఆరో సీడ్ రూడ్‌ను ఓడించాడు. టామీ పాల్(అమెరికా) 6-7(3/7), 6-0,6-3,6-1 తేడాతో జపాన్ ప్లేయర్ నిషికోరిపై విజయం సాధించాడు. పారిస్‌ ఒలింపిక్స్ 2024 మహిళల విజేతగా నిలిచిన చైనా స్టార్‌, ఐదో సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌కు బిగ్ షాక్ తగిలింది. జర్మనీకి చెందిన 36 ఏళ్ల లారా సిగెమండ్‌ 7-6(3), 6-3తో 22 ఏళ్ల జెంగ్‌ను చిత్తుచేసింది. మిగతా క్రీడాకారిణుల్లో టాప్‌ సీడ్‌ సబలెంక 6-3, 7-5తో బౌజా్‌సపై, మూడో సీడ్‌ గాఫ్‌ 6-3, 7-5తో బురేజ్‌పై, ఏడో సీడ్‌ పెగులా 6-4, 6-2తో మెర్టెన్స్‌పై, మాజీ నెంబర్‌వన్‌ నవోమి ఒసాక 1-6, 6-1, 6-3తో ముచోవాపై గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు రోహన్‌ బోపన్న, యుకీ భాంబ్రీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఆరంభ రౌండ్లో బోపన్న-నికోలస్‌ ద్వయం 5-7, 6-7(5)తో మార్టినెజ్‌-మునార్‌ జోడీ చేతిలో ఓడింది. భాంబ్రీ-అల్బానో ఒలివెట్టి జోడీ 2-6, 6-7(7)తో ట్రిస్టన్‌-ఆడమ్‌ చేతిలో ఖంగుతిన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)