టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో ఇది వృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో టాటా పంచ్ మైక్రో SUV సేల్స్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్కెట్‌లోకి లాంచ్ అయిన అనతి కాలంలోనే టాటా పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2024 ఏడాదిలో కూడా టాటా పంచ్ ఇండియా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. దీంతో మారుతీ సుజుకీ నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి తెరపడినట్లయింది. గత క్యాలెండ్ సంవత్సరంలో టాటా పంచ్‌ను దాదాపు 2.02 లక్షల మంది కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 వరకు 1.48 లక్షల మంది కొన్నారు. ఇది 2021లో మైక్రో SUVగా లాంచ్ అయింది. మార్కెట్‌లోకి అడుగుపెట్టిన 38 నెలల్లోనే 5 లక్షల యూనిట్ల సేల్స్‌ను సాధించి ఈ కారుకు డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదని నిరూపించింది. మొత్తంగా గణంకాలను చూసినట్లయితే టాటా ఇప్పటివరకు 5,04,447 పంచ్‌లను మార్కెట్లో విక్రయించింది. ఇది లాంచ్ అయిన 10 నెలల్లోనే ఒక లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తర్వాత 2 లక్షల యూనిట్లకు కూడా వేగంగానే చేరుకుంది. 20 నెలల్లో ఈ మైలురాయిని అధిగమించింది. తిరిగి 28 నెలలకే మొత్తంగా 3 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. 2024 జూన్‌లో 4 లక్షల యూనిట్ల మార్కును చేరింది. ఆ తర్వాత ఏడాది ముగింపు నాటికి 6 నెలల కాలంలోనే 4 లక్షల నుంచి ఏకంగా 5 లక్షల మార్కును సాధించింది. ప్రధానంగా గత ఏడాది అక్టోబర్ పండుగ సమయంలో కంపెనీ టాటా పంచ్ కారుపై భారీ తగ్గింపులు ఇవ్వడంతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డీలర్లు అదనంగా ప్రత్యేక తగ్గింపులు ఆఫర్ చేయడం వలన కొత్త కస్టమర్లు చాలా మంది పంచ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. టాటా పంచ్ 1.2-లీటర్, మూడు-సిలిండర్, NA పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమ్ముడవుతున్న టాటా పంచ్ అకాంప్లిష్డ్ ప్లస్,అడ్వెంచర్ ఎస్, ప్యూర్, ప్యూర్ (ఓ), అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, అడ్వెంచర్,క్రియేటివ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్ వంటి వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. టాటా పంచ్‌లో ప్రయాణికుల సేఫ్టీ కోసం అధునాతన ఫీచర్స్ అందించారు. సేఫ్టీ విషయంలో కంపెనీ రాజీ పడలేదు. కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో,వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఇతర అధునాత ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.
అనతి కాలంలో టాటా పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలు !
January 16, 2025
0
Tags