బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారని ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. “నేను కాంగ్రెస్ మద్దతుదారులతో మాట్లాడాలనుకుంటున్నా. వాళ్లతో మాట్లాడుతూ ఎవరికీ ఓటు వేస్తారని అడిగాను. కాంగ్రెస్ కు వేస్తామని చెప్పారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అసలు అవకాశమే లేదు కదా. ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు” అని అడిగా. చాలా కాలంగా అదే పార్టీలో ఉంటున్నామని, హస్తం గుర్తుకు ఓటేయడం అలవాటుగా మారిపోయిందని వాళ్లు చెప్పిన సమాధానం చూసి.. ఒకింత ఆశ్చర్యపోయా. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని వాళ్లకు కూడా తెలుసు. పార్టీ నేతలపై వాళ్లు తీవ్ర అసహనంతో ఉన్నారు.
బీజేపీని గెలిపించడమే కాంగ్రెస్ లక్ష్యం : అరవింద్ కేజ్రీవాల్
January 30, 2025
0
Tags