ఛత్తీస్‌గఢ్ - ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో చలపతి కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్‌పూర్‌కు తరలించారు.
ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి మృతి
January 22, 2025
0
Tags