పనామా కాలువ మా దేశానికే సొంతం : పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో

Telugu Lo Computer
0


నామా కాలువను తమకు అమెరికా ఏమీ బహుమతిగా ఇవ్వలేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో స్పష్టం చేశారు. అది తమ దేశానికి సొంతం అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ములినో మాట్లాడుతూ పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదు. అది మాది, మాకు మాత్రమే సొంతం అని అన్నారు.  ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం తర్వాత చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని,  తాము దానిని చైనాకు ఇవ్వలేదని, పనామాకు ఇచ్చామని పేర్కొన్నారు. ''ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటాం'' అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ములినో మాట్లాడుతూ పనామా కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్న ఆయన, ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు.1914లో పనామా కాలువను అమెరికా నిర్మించింది. అయితే.. పనామా దేశంతో జరిగిన ఒప్పందం మేరకు 1999లో ఆ కాలువను ఆ దేశానికి తిరిగి అప్పగించింది. అయితే.. అమెరికా వాణిజ్య.. నౌవికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా పీజుల్ని వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా కుదరకుంటే.. పనామా కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పనామా అధ్యక్షుడు సీన్లోకి వచ్చి.. పనామా కాలువను అమెరికా తమకు బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో.. పనామా అధ్యక్షుడి వ్యాఖ్యలకు ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)