యూజర్లను ఆకట్టుకుంటున్న జియో 72 రోజుల రూ.749 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్

Telugu Lo Computer
0


జియో 72 రోజుల రూ.749 బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటుంది. రూ. 749 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. అంతేకాదు ఫ్రీ లోకల్, ఎస్టిడి ఏ నెట్వర్క్ అయినా ఉచితం. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌ లు ఉచితంగా పొందవచ్చు. ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. ఇదే కాకుండా అదనంగా 20 జీబీ అదను డేటా కూడా పొందవచ్చు. అంటే మొత్తం 164 జీబీ పొందవచ్చట. మీ ఏరియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే అపరిమిత 5జి డేటా పొందవచ్చని చెబుతున్నారు. కేవలం ఇవే కాకుండా అదనంగా ఈ ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే జియో సినిమా ఉచితంగా పొందవచ్చట.  అలాగే జియో టీవీ ఛానల్స్ కూడా ఫ్రీగా పొందవచ్చని చెబుతున్నారు. ఇంకా జియో కాంప్లిమెంటరీ క్లౌడ్ స్టోరేజ్ కూడా యూజర్లు ఉచితంగా పొందవచ్చట. అంటే రూ.749 రూపాయలతో లాంగ్ టైం వాలిడిటీ ఆప్షన్ మాత్రమే కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్,హై స్పీడ్ డేటా తో పాటు జియో క్లౌడ్ ఉచితంగా పొందవచ్చట. ఎంటర్‌టైన్మెంట్‌ కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)