సోనియాగాంధీకి రాష్ట్రపతి అంటే అపారమైన గౌరవం ఉందని, తన తల్లి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ప్రియాంక తప్పుపట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు, దేశాన్ని నాశనం చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని అన్నారు. తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు, అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించారు. అనంతరం పార్లమెంట్ హాల్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక బయటకు వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రశ్నించారు. దీనికి సోనియా బదులిస్తూ… ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని.. ఆమె మాట్లాడలేకపోయారని.. పాపం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానించారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు, దేశాన్ని నాశనం చేసిన బీజేపీ : ప్రియాంక
January 31, 2025
0
Tags