సంక్రాంతి పండుగ సందర్భంగా యూట్యూబ్‌లో ఫ్రీగా 'మిస్టరీ' సినిమా విడుదల !

Telugu Lo Computer
0


సంక్రాంతి పండుగ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం చేస్తూ నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా "మిస్టరీ". ఈ సినిమాను య్యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. నేటి నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తనికెళ్ళ భరణి, అలీ, సుమన్, తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, వెంకట్ దుగ్గిరెడ్డి , రవి రెడ్డి, సత్య శ్రీ, ఆకెళ్ల, గడ్డం నవీన్, శోభన్ బొగరాజు, ఎం.ఎస్ నాయుడు , లు ఇలా ప్రముఖ తారాగణం తో తెరకెక్కిన ఈ సినీమా థియేటర్లలో విడుదలైన చాలా రోజులకి ఓటీటీలోకి వచ్చేసింది. తన సినిమా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు తల్లాడ సాయికృష్ణ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఒక మర్డర్ జరగడం, అసలు ఎలా ఆ క్రైం జరిగిందీ అనే కోణం లో సినిమా మొదలు అవుతుంది.కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మంచి స్క్రీన్ ప్లే తో సినిమా సాగుతోంది.మల్టీ లినియర్ స్క్రీన్ ప్లే ని ఈ సినిమా కి ఉపయోగించారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కి సంగీతం అందించిన పవన్ ఈ సినిమా కి బ్యాక్రౌండ్ సంగీతం అందించారు. ఒక గంట 50 నిమిషాలు నిడివిగల ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని, సినిమా చివర వరకు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని సాయికృష్ణ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)