ఐఫోన్ 17 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అని చెబుతూ కొన్ని ఫోటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 17 మోడల్‌కు సంబంధించిన అనేక ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 2025లో లాంచ్ అవుతుంది. ఐఫోన్ 17 మోడల్‌లో చాలా మార్పులు కనిపించనున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలలో టైటానియం ఫ్రేమ్ ఇచ్చారు. ఐఫోన్ 17 అల్యూమినియం ఫ్రేమ్‌ను పొందినట్లయితే, ఇది ఇప్పటివరకు యాపిల్ చేసిన అతిపెద్ద మార్పు అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కొన్ని లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్ యాపిల్ నెక్స్ట్ జనరేషన్ A18 ప్రో చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది టీఎస్ఎంసీ కొత్త 3వ తరం 3nm ప్రాసెస్ ద్వారా తయారు చేశారు. ఈ మోడల్‌లోని కెమెరాకు సంబంధించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఐఫోన్ 17 మోడల్‌కు కెమెరా అప్‌గ్రేడ్ రావచ్చని చెబుతున్నారు. కంపెనీ ఐఫోన్ 17లో 24-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను, ఐఫోన్ 17 ప్రోలో అప్‌గ్రేడ్ చేసిన 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించే అవకాశం ఉందంటున్నారు.
బిగ్ డిస్‌ప్లే, అప్‌గ్రేడ్లతో విడుదల కానున్న ఐఫోన్ 17 ?
January 13, 2025
0
Tags