రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు సిద్ధం : వ్లాదిమిర్ పుతిన్

Telugu Lo Computer
0


రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ మేరకు రష్యా అధికారిక టెలివిజన్‌ పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన స్మార్ట్‌ అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేకాదు, 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ గనక విజయం సాధించి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కానీ, అమెరికాతో సంప్రదింపులు విషయమై మాత్రం పుతిన్‌ స్పష్టతనివ్వలేదు. పుతిన్‌ను కలిసి మాట్లాడేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు ఇటీవల ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, వాషింగ్టన్‌ నుంచి పిలుపుకోసం తాను ఎదురుచూస్తున్నట్లు పుతిన్‌ అన్నారు. కాగా, ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై ఎప్పుడు స్పందించినా ట్రంప్ ఒకమాట చెబుతూ వస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో కనుక తాను గెలిచి ఉంటే రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరగనిచ్చే వాడిని కాదని చెబుతున్నారు. తాజాగా పుతిన్ ఈ విషయం నిజమేనని, ట్రంప్ అందుకు సమర్థుడని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో పొడసూపిన విభేదాలపై సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)