తిరుపతిలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మొత్తం 40 మంది ప్రజలకు తీవ్ర గాయాలు కాగా అందులో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన పై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా తన ట్వీట్లో ఆయన ఇలా రాసుకొచ్చారు. 'తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరుతున్నానని కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది : రాహుల్ గాంధీ ట్వీట్ !
January 09, 2025
0
Tags