ఈడీ, సీబీఐలకు భయపడే విజయసాయిరెడ్డి రాజీనామా : కేతిరెడ్డి

Telugu Lo Computer
0


ఈడీ, సీబీఐలకు భయపడే ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. తన అల్లుడి విషయంలో కొన్ని నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయని, ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ అసలు కారణం మాత్రం ఇదేనన్నారు.'జగన్‌కు, పార్టీకి మొదటి నుంచి విథేయుడిగా పని చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. పార్టీ తరపున ఢిల్లీలో ప్రాతినిథ్యం వహించారు. ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి అయిన తర్వాత కొన్ని తప్పులు బయటకు వచ్చాయి. రాజీనామాకు కారణాలు ఎన్ని చెప్పినా నెగిటివ్ పార్ట్సే నిజం. రాజకీయం చేయలేని పరిస్థితిలో విజయసాయిరెడ్డి లేరు' అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)