ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన నాగూర్ వలీ అనే యువతికి జీవ మణి అనే యువకుడితో నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడగా, అదికాస్త ప్రేమగా మారింది. ఇది గమనించిన తల్లి ఎస్తేర్ కూతురుని పలుమార్లు మందలించింది. దీంతో తల్లిని ప్రియుడితో కలిసి హతమార్చాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తల్లి ఎస్తేర్ తలపై కూతురు జీవ మణి సిమెంట్ రాయితో కొట్టి హత్య చేసింది. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులైన నాగూర్ వలీ, జీవమణీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)