అమెరికాలోని వాషింగ్టన్ ఏవ్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా హైదరాబాద్ కు చెందిన రవితేజ చనిపోయాడు. చైతన్య పురి పరిధిలోని అర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెం. 2 నివాసం ఉంటున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ మృతితో అర్కేపురంలోని అతని నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు మృతి
January 20, 2025
0
Tags