సినీ నటుడు విజయ రంగరాజు మృతి

Telugu Lo Computer
0


సినీ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతోతుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో విజయ రంగరాజు గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. విజయ రంగరాజు మద్రాసులో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించాడు. మోహన్ లాల్ నటించిన వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమాతో సినిమా రంగంలో అరంగేట్రం చేసాడు. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 రోజులు ఆడడంతో అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన 'సీతా కళ్యాణం' రంగరాజుకు నటుడిగా తెలుగులో మొదటి సినిమా. అయితే 1994 లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో రంగరాజు నటనకు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎక్కువగా విలన్, సహాయ పాత్రలు పోషించి టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)