వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్‌ చేసే డెమో సక్సెస్ : ఇస్రో

Telugu Lo Computer
0


వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్‌ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించినట్లు     భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.  మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లోని టెస్ట్ ఫెసిలిటీ సెంటర్లో దీన్ని చేపట్టినట్లు ఈరోజు ఇస్రో వెల్లడించింది. అయితే, వివిధ దశల్లో వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్‌ను ధ్రువీకరించుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. తాజాగా 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించగా, 120 సెకన్ల పాటు షట్‌ డౌన్ చేసింది. తర్వాత రీస్టార్ట్ చేసి, ఏడు సెకన్ల పాటు మరోమారు మండించింది. ఈ ప్రక్రియలో ఇంజిన్‌లోని అన్ని పారా మీటర్లు నార్మల్ గా, ఊహించిన విధంగానే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే, అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించుకోవడానికి చేస్తోన్న టెస్టుల్లో ఇదొక సానుకూల పరిణామం అని తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)