దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. పవర్, మెటల్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. 319 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,300 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,319.50 (క్రితం ముగింపు 76,724.08) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రోజంతా లాభాల్లోనే కదలాడింది. దీంతో ఇంట్రాడేలో 77,319.50 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 318 పాయింట్ల లాభంతో 77,042.82 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,391.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 98.60 పాయింట్ల లాభంతో 23,311.80 వద్ద ముగిసింది. రిలయన్స్, ఇన్ఫోసిస్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. వీటి కోసం మదుపరులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.82 శాతం లాభపడగా, ఇన్ఫోసిస్ షేర్లు 1.52 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, బాజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81.86 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,735.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.56 వద్ద స్థిరపడింది.
లాభాల్లో ముగిసిన సూచీలు !
January 16, 2025
0
Tags