భారీగా పెరిగిన బంగారం ధర !

Telugu Lo Computer
0


నవరి ప్రారంభం నుంచి పసిడి ధరలు బ్రేకు లేకుండా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గతవారం రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర రూ.9,400 పెరగగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.8,600 పెరిగింది. చైనా, ఇండియా వంటి సెంట్రల్ బ్యాంకులు నిరంతరం చేపడుతున్న పసిడి కొనుగోళ్లు ధరలను పెంచుతున్నాయి. అలాగే పన్నులు, భౌగోళిక రాజకీయ అంశాలపై త్వరలో బాధ్యతలు చేపట్టనున్న యూఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు అమెరికా డాలర్‌ను బలపరిచగా, బంగారం లాభాలను తగ్గించాయి. నిపుణుల తాజా అంచనాల ప్రకారం 24 క్యారెట్ల పసిడి ధర త్వరలోనే 10 గ్రాములకు రూ.76,500 వరకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. మరిన్ని కారణాలు కూడా ధరలను పెంచుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, పూణేలో రూ.7300, అహ్మదాబాదులో రూ.7305, జైపూరులో రూ.7301, లక్నోలో రూ.7301, కోయంబత్తూరులో రూ.7286, మధురైలో రూ.7286, నాశిక్ లో రూ.7289, మైసూరులో రూ.7286, అయోధ్యలో రూ.7301, బళ్లారిలో రూ.7286, గురుగ్రాములో రూ.7301, నోయిడాలో రూ.7301 వద్ద నేడు విక్రయాలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)