దేశంలో 2024, ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 6 శాతం పెరిగి 2.82 బిలియన్ డాలర్ల (సుమారు రూ.24,250 కోట్ల)కు చేరుకున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగంలో నిధుల ప్రవాహం పెరగడం వల్ల ఇది సాధ్యమయిందని అనరాక్ తెలిపింది. అయితే, ఇదే సమయంలో ప్రైవేట్ ఈక్విటీ డీల్స్ సంఖ్య 30 నుంచి 24కు పడిపోయింది. ఈ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లో 82 శాతం విదేశీ నిధుల ద్వారా వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో 62 శాతం పారిశ్రామిక, లాజిస్టిక్ రంగానికి రాగా; హౌసింగ్‌కు 15 శాతం, కార్యాలయ రంగానికి 14 శాతం, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులకు 9 శాతం వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో జరిగిన మొత్తం ప్రైవేట్ ఈక్విటీ లావాదేవీల్లో టాప్ 10 డీల్స్ 93 శాతం వాటాను కలిగి ఉన్నాయని అనరాక్ క్యాపిటల్ సీఈఓ 'శోభిత్ అగర్వాల్' తెలిపారు.
స్థిరాస్తి రంగంలో పెరిగిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు !
January 13, 2025
0
Tags