రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో భారతీయ వలసల బహిష్కరణకు ట్రంప్ లింక్ ?

Telugu Lo Computer
0


ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫోన్ కాల్ చేశారు. ఇందులో మీ అక్రమ వలసలను వెనక్కి పిలిపిస్తారా లేక మమ్మల్నే తరిమేయమంటారా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై అమెరికా వచ్చి చర్చిస్తానని ట్రంప్ కు చెప్పారు. దీంతో వైట్ హౌస్ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది. భారత ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా వచ్చి ట్రంప్ తో భేటీ అవుతారని వెల్లడించింది. అలాగే మోడీకి ట్రంప్ పెట్టిన షరతుపై కూడా సంకేతాలు ఇచ్చేసింది. అమెరికా రక్షణ సామాగ్రిని ఇప్పటికే భారీగా కొనుగోలు చేస్తున్న భారత్, ఇప్పుడు ట్రంప్ షరతుతో దాన్ని మరింత పెంచాల్సిన పరిస్ధితి ఎదురు కాబోతోంది. ఈ మేరకు తమ రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో భారతీయ వలసల బహిష్కరణకు ట్రంప్ లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మోడీ-ట్రంప్ చర్చల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. వీరిద్దరి చర్చల తర్వాత అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లపై భారత్ నుంచి వచ్చే ప్రకటనను బట్టి వలసలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)