వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు జిల్లా నాలుగో అదనపు కోర్టు రూ.10వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో తమను మోసం చేశారని మరియమ్మ బహిరంగంగా దూషించింది. తనకు పెన్షన్ ఆపేశారని, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడింది. దీంతో నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. మరియమ్మను తీవ్రంగా కొట్టి చంపేశారు. ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని, కేసును పక్కన పెట్టారని మరియమ్మ కుమారుడు ఆరోపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాలంటూ మరియమ్మ కుమారుడు విజ్ఞప్తి చేశాడు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు నెలలుగా జైల్లో ఉన్న నందిగం సురేష్‌కు తాజాగా బెయిల్ మంజూరైంది.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు !
January 28, 2025
0
Tags