భక్తితో దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్ !

Telugu Lo Computer
0


తిరుపతిలో టోకెన్ల పంపిణీలో అపశ్రుతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఇలా జరగకూడదని కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముందుగా ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. “వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు వెళ్తున్న భక్తులు, ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, త్రోపులాటలకు తావివ్వకుండా, ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తితో దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)