తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రవర్తనపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమ సమావేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు. మంత్రిని తాను స్టేజ్‌పై ఉండగానే అల్లరి చేయడం లీడర్ లక్షణం కాదన్నారు. యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదు.కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు.తనకు కౌశిక్‌రెడ్డికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇటీవల కరీంనగర్ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేదికపై ఉండగానే కౌశిక్‌రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆయనను నెట్టివేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ గొడవలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. అంతకు ముందు కూడా బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి వివాదాస్పద సవాల్ విసిరి గొడవకు కారణమయ్యారు.
తన తీరు మార్చుకోకపోతే కౌశిక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తులో ఇబ్బందులు పడతాడు !
January 24, 2025
0
Tags