దేశీయ మార్కెట్లోకి హోండా డియో స్కూటర్ విడుదల !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లోకి హోండా ఎంట్రీ లెవెల్ స్కూటర్ రేంజ్ కింద డియో స్కూటర్‌ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. హోండా డియో 2025 స్కూటర్ మొత్తంగా ఐదు కలర్ ఆప్షన్లతో వస్తోంది. పియర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ, పియర్ల్ ఇగ్నియస్ బ్లాక్ ప్లస్ పియర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. హోండా డియో 2025 కంపెనీ సిగ్నేచర్ స్టైల్‌తో స్పోర్టీ డిజైన్, ప్రాక్టికల్ స్ట్రక్చర్‌తో వస్తోంది. డియోలోని V షేప్ హెడ్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్, హ్యాండిల్‌పై ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో పాటు బోల్డ్ టెయిల్ ల్యాంప్ యూనిట్‌తో డిజైన్ అయింది. 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ రావడంతో అన్ని రకాల రోడ్లపై కంఫర్ట్‌గా రైడ్ చేయొచ్చు. యువతను అట్రాక్ట్ చేసేందుకు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తక్కువ ధరకే డియో స్కూటర్ 2025 అందుబాటులోకి వచ్చింది. ఇందులో 4.2-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ డిస్‌ప్లే ఉంది. ఇది ఎకో ఇండికేటర్, ట్రిప్ మీటర్, క్లస్టర్ డిస్టెన్స్, మైలేజ్ ఇండికేటర్ వంటి మల్టిపుల్ రైడ్ డేటాను చూపిస్తుంది. ఇందులో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. డియో స్కూటర్ OBD2B ప్రమాణాలకు అనుగుణంగా 110 సీసీ సామర్థ్యంతో కూడిన ఇంజిన్‌ని కలిగి ఉంది. దీంతో స్కూటర్ నుంచి కర్బన ఉద్గారాలు తక్కువగా వెలువడతాయి. ఈ సింగిల్ సిలిండర్ ఇంజిన్ గరిష్ఠంగా 8BHP పవర్, 9Nm పీక్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ని ఇది కలిగి ఉంది. దీంతో పాటు ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఉండటంతో ఫ్యూయల్ వినియోగాన్ని మెరుగు పరుస్తుంది. 1808 mm పొడవు, 723 mm వెడల్పు, 1150 mm ఎత్తు, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది డియో ఎస్టీడీ, డీఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీఎల్ఎక్స్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.85,648గా ఉంది. ఇక ఎస్టీడీ వేరియంట్ ధర రూ.74,930 (ఎక్స్ షోరూం) తో ప్రారంభం అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)