ముంబైలో జీ రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహా రాష్ట్ర ముఖ్య మంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. బాలీవుడ్ గాయకుడు కుమార్ సానూ సంగీతంలో చేసిన అపార సేవలకు గాను ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా జీవిత కాల సాఫల్య పురస్కారంను అందుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో అజయ్ దేవ్ గన్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి, అమోఘ్ లీలా దాస్, కార్తిక్ ఆర్యన్, వంటి ప్రముఖులు జీ రియల్ హీరోస్ అవార్డ్స్ అందుకున్నవారిలో ఉన్నారు. వీరంతా సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా జీ రియల్ హీరోస్ అవార్డులు అందుకున్నారు. జీ రియల్ హీరోస్ కార్యక్రమంలో గ్రాండ్ గా జరిగింది. ముఖ్యంగా వివిధ రంగాలలో చేసిన సేవలను గుర్తించి.. జీ మీడియా రియల్ హీరోస్ అవార్డులతో సత్కరించింది. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ 2024 కు గాను సంగీత ప్రపంచంలో కుమార్ సానూ విశేషమైన సేవలు చేసినట్లు జీ రియల్ హీరోస్ అవార్డ్స్ టీమ్ గుర్తించింది. దీంతో ఆయన చేసిన సేవలకు గాను.. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ తో సత్కరిచింది. అయితే.. కుమార్ సానును.. బాలీవుడ్ లో.. "కింగ్ ఆఫ్ మెలోడీ" అని పిలుస్తుంటారు. ఆయన 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఒకే రోజులో అత్యధిక పాటల్ని రికార్డు చేసి గిన్నిస్ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు.
కుమార్ సానూ జీవితకాల సాఫల్య పురస్కారం !
January 15, 2025
0
Tags