తైదలు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


తైదల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే తైద రొట్టెలు తినేవారిలో, తైద అంబలి తాగేవారిలో ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. విటమిన్ బి1, బి2, బి6, అలాగే విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు, లిగ్నాన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తైదలతో తయారు చేసిన రొట్టె, అంబలి, సంగటి ఇతర ఏ రూపంలో ఉన్నా అది బలం. పైగా ఇది గ్లూటెన్ ఫ్రీ  ధాన్యం. అలసట, అసహనం వంటి ఉదర కుహర వ్యాధి ఉన్నవారికి అద్భుతమైన ఆహారం. ఫింగర్ మిల్లెట్‌లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగు పర్చడంలో సహాయపడతాయి. తైదల్లోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కాబట్టి తైదరొట్టెలు తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇక డైజెస్టివ్ హెల్త్ విషయానికి వస్తే తైదల్లోని ఫైబర్ కంటెంట్ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. హెల్తీ గట్ బాక్టీరియాకు సపోర్టుగా నిలుస్తుంది. ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉండటంవల్ల తైదలను ఆహారంగా ఉపయోగిస్తే అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే ఇవి బరువు నిర్వహణలో సహాయపడే ఫిల్లింగ్ అండ్ సంతృప్తికరమైన ఆహారంగా మారుతాయి. రాగుల్లోని ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. తైదల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే ఫినోలిక్ ఆమ్లాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నట్లు ఇటీవలి అధ్యయనంలో తేలింది కాబట్టి తైద రొట్టెలు తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. తైదలను రకరకాల ఆహారాలుగా ఉపయోగించవచ్చు. తైదపిండితో రొట్టెలు చేసుకొని తినవచ్చు. అట్లనే రాగి సంగటి, రాగి పాయసం రూపంలో తీసుకోవచ్చు. పాలలో తైద పిండిని ఉడికించడం ద్వారా కూడా ఆహారంగా ఉపయోగించవచ్చు. అట్లనే గంజిలో తైదపిండిని కలిపి రొట్టెలు, వొడియాల మాదిరి పదార్థాలు చేసుకోవచ్చు. ఇక ఇడ్లి, దోశ లేదా ఉప్మా వంటి బ్రేక్ ఫాస్ట్‌ను కూడా తైదపిండితో చేయవచ్చు. మొత్తమ్మీద తైదలు బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే ముఖ్యమైన పోషకాహారంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది సమతుల్య ఆహారం కాబట్టి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో తైదలు అద్భుతం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)